Election Commission: నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం..?
Election Commission: చంద్రబాబు, వైసీపీ ఎంపీలు సీఈసీని కలవడంతో ఏపీకి అధికారులు
Election Commission: నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం..?
Election Commission: నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రానున్నట్లు తెలుస్తోంది. ఫామ్-7లు భారీగా వస్తుండటంతో సీఈసీ అప్రమత్తమయ్యింది. చంద్రబాబు, వైసీపీ ఎంపీలు సీఈసీని కలవడంతో అధికారులు ఏపీకి వస్తున్నట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకే వస్తున్నారంటున్నారు అధికారులు. ఓట్ల తొలగింపులో జాగ్రత్తలు వహించాలంటూ... ఇప్పటికే కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలు జరిగితే ఉద్యోగాలు పోతాయని BLOలను హెచ్చరించారు. సీఈసీ బృందం రాకతో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు.