CBI Court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
CBI Court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
జగన్(ఫైల్ ఇమేజ్ )
CBI Court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్ న్యాయవాది మరోసారి గడువు కోరడంతో విచారణను జూన్ 1 వరకు వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇప్పటికే రెండుసార్లు జగన్ తరపు న్యాయవాది గడువు కోరగా ఇవాళ మరింత సమయం కావాలని కోర్టుకు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా కౌంటర్ దాఖలుకు సమయం పడుతుందని తెలిపారు. దీంతో జూన్1 వరకు గడువిచ్చిన సీబీఐ కోర్టు ఆ లోపు కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ జరుపుతామని తెలిపింది.