Manyam District: మన్యం జిల్లాలో గణనీయంగా తగ్గిన జీడిమామిడి దిగుబడి

Manyam District: దిగుబడి తగ్గిపోయినా... గిట్టుబాటు ధర కరవు

Update: 2022-05-18 05:49 GMT

Manyam: మన్యం జిల్లాలో గణనీయంగా తగ్గిన జీడిమామిడి దిగుబడి

Manyam District: కలసిరాని కాలం అనుకూలించని పరిస్థితులతో మన్యంలో గిరిజన రైతులు విలవిల్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం ఆశాజనకంగా ఉన్న జీడి పంట దిగుబడి ఈసారి ప్రకృతిలో మార్పుతో పూతదశలోనే కోలుకోని దెబ్బతీసింది. జీడి గింజల దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో రాబడిలేక గిరిజనులు విలపిస్తున్నారు. అంతంతమాత్రంగా ఉన్న జీడిగింజలకు గిట్టుబాటుధర లేదని గిరిజన రైతులు మదనపడుతున్నారు.

ఇది ఒకప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జిల్లాల పునర్విభజన తర్వాత మన్యం జిల్లాగా రూపుదిద్దుకుంది. నాలుగు మన్యం మండలాల్లో గిరిజనులు జీడిగింజల ఉత్పత్తిని ప్రధాన ఉపాధి వనరుగా ఎంచుకున్నారు.. ఈ ప్రాంతాల్లో కొండలపై రాళ్ల రప్పల మధ్య, కొండ దిగువన మైదానం ప్రాంతాల్లో జీడి మామిడిని గిరిజన రైతులు సాగుచేస్తారు. ఈ పంటే వారికి జీవనాధారం. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కన్నా ఈ మన్యం ప్రాంతం నుండే జీడి పిక్కలపై వ్యాపారులకు మక్కువ. సాధారణంగా ఇదే సీజన్లో ఇక్కడి జీడి పిక్కలు ఎగుమతులు ఆశాజనకంగా సాగుతుంది జరుగుతుంది. మన్యంలో పండే ఈ పంట పలాసతో పాటు విశాఖపట్నం జిల్లాలో తగరపువలసకు, విజయనగరం జిల్లాకు, ఒడిషా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు సీతంపేట సంత నుండి వెళుతుంటాయి.

తెల్లబంగారంగా పేరుగాంచిన జీడి పంట ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది చేతికి పంట వస్తుందని ఆశించారు. పార్వతిపురం మన్యంజిల్లాలో వీరఘట్టాం, పాలకొండ రూరల్, సీతంపేట, భామిని మండలాలలో వేలాది ఎకరాల్లో జీడి పంటను కొండలపై, మైదాన ప్రాంతాల్లో పండిస్తారు. ప్రతి సంవత్సరంలాగే 45 వేల ఎకరాల్లో ఉండే ఈ జీడి పంట పూత కూడా జనవరి ఆఖరులో రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో పొగమంచు, విపరీతమైన చలి, పగటి పూట ఉక్కపోత తో ఈసారి పూత దశలోనే రాలిపోయింది. అలాగే అకాలవర్షాలు, తెలుగుళ్లతో ఉన్న పిందెలు కూడా రాలిపోవడంతో గిరిజన రైతులు విలవిల్లాడుతున్నారు. గిరిజన కుటుంబాలకు ప్రతి సంవత్సరం 45 వేల నుండి 60 వేల రూపాయలమే రాబడి అందేది. కాని ఈ సంవత్సరం తగ్గిన జీడిమామిడి దిగుబడితో ఎకరాకి 10 వేలు కూడా వచ్చే స్థితి లేదని రైతులు వాపోతున్నారు.

సహజ పద్దతిలో కొండలపై పండే జీడిమామిడి గింజలకు గిరాకీ ఉండేది. ఇప్పటికైతే ఉన్న పంటకు గిట్టు బాటు ధర లేదు గతంలో దళారులు కొందరు ప్రభుత్వ రేటు కన్నా ఎక్కువ ధరతో జీడిగింజలను తీసుకెళ్లేవారు. ఇప్పటి పరిస్థితులు గిరిజన రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రైతు భరోసా అంటూ వరి పండించే రైతుకు మాత్రమే ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ ఆదుకుంటారు.. కాని ఐటిడిఎ పరిధిలో తమను ఆదుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News