జేసీ ప్రభాకర్ రెడ్డికి మాధవీలత షాక్: సైబరాబాద్ పోలీసుల కేసు
JC Prabhakar Reddy VS Madhavilata: జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి మాధవీలత షాక్: సైబరాబాద్ పోలీసుల కేసు
JC Prabhakar Reddy VS Madhavilata: జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 మార్చి 31న తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం నూతన సంవత్సర ఈవెంట్ ను నిర్వహించారు. మహిళల కోసం ఈవెంట్ నిర్వహించడంపై సినీ నటి మాధవిలత విమర్శలు చేశారు. ఇందులో మహిళలు పాల్గొనవద్దని ఆమె కోరారు. ఈవెంట్ కు వెళ్లిన మహిళలు ఇబ్బందిపడే అవకాశం ఉందని మాదవిలత ఆరోపించారు. మాధవిలతకు మద్దతుగా మరో బీజేపీ నాయకురాలు యామిని శర్మ కూడా మాట్లాడారు.
మహిళల కోసం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు. సంప్రదాయాలు ఎటు పోతున్నాయని ఆమె ప్రశ్నించారు. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలకు సంబంధించిన వీడియోలు పోస్టు చేశారు. బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
కానీ, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ చేశారు. ఈవెంట్ ముగిసిన తర్వాత తనపై విమర్శలు చేసిన మాధవిలత, యామినిశర్మతో పాటు బీజేపీ నాయకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మాధవిలతపై పరుష పదజాలం ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మాధవిలతపై తాను ఉపయోగించిన పరుషపదజాలంపై జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. ఆవేశంతో తాను నోరుజారారని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ, మాధవీలత హైదరాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.