Konaseema District: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు..
Konaseema District: గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు
Konaseema District: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు..
Konaseema District: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కారు దారితప్పింది. అంబాజీపేట మండలం ముక్కామల వద్ద ప్రమాదం జరిగింది. నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు పంటకాలలోకి దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ముక్కామల వద్ద వెస్ట్ కెనాల్ లో కారు పల్టీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం జలం చెరువుకు చెందిన పిల్లి సుధీర్ బాబు, పిల్లి అనీలు, కే బాబి ,కట్టా ప్రసాద్ ఉన్నారు. వీరిలో కట్ట ప్రసాద్ కి తప్పితే మిగిలిన వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం తరలించారు. కారు ప్రమాదానికి గురైన సమయంలో యువకులు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు.