Andhra Pradesh: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

* అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి బుగ్గన * వికేంద్రీకరణ జరిగితేనే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి- బుగ్గన

Update: 2021-11-23 05:50 GMT

బుగ్గన రాజేంద్రనాథ్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని భావించామన్నారు మంత్రి బుగ్గన.

పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లోనే పెట్టారని, మిగతా రాష్ట్రాలు బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌ వంటి సెక్టార్స్‌ను రాజధాని ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్న బుగ్గన వికేంద్రీకరణ జరగకపోతే ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి అవుతుందని వివరించారు.

Full View


Tags:    

Similar News