Buddha Venkanna: కొడాలి నాని మనిషి కాదు... కొడాలికి మూడు రకాల పిచ్చి పట్టుకుంది..
Buddha Venkanna: మంత్రి కొడాలి నానికి మూడు రకాల పిచ్చి పట్టుకుందని కామెంట్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.
Buddha Venkanna: కొడాలి నాని మనిషి కాదు...
Buddha Venkanna: మంత్రి కొడాలి నానికి మూడు రకాల పిచ్చి పట్టుకుందని కామెంట్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తన పదవిని ఐదేళ్ళ పాటు కొనసాగించుకోవాలనే కోరికతో తొలి నుంచి ఒక పథకం ప్రకారం చంద్రబాబును తిడుతున్నాడని చెప్పారు. కొడాలి నాని మనిషి కాదని..ఒక మృగమని..మృగానికి ఆ భాషలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు వెంకన్న.
మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై తాము నిన్న ప్రెస్ మీట్ పెట్టామని బుద్దా వెంకన్న అన్నారు. వెంటనే పోలీసులు తన ఇంటికి వచ్చి తనను స్టేషన్‌కు తీసుకువెళ్లారన్నారు. మళ్లీ సాయంత్రం కొడాలి నాని మీడియా సమావేశంలో చంద్రబాబు, టీడీపీ నేతలను తిట్టడం మొదలెట్టారని, ఆయనను ఎందుకు పోలీసులు అరెస్టు చేయలేదని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.