Buddha Venkanna: భూకబ్జాలకు పెటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కేశినేని నాని.. బస్సు టిక్కెట్లు బ్లాకులో అమ్ముకున్నాడు

మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడిగా పేరొందారు కేశినేని నాని - బుద్ధా వెంకన్న

Update: 2024-01-21 13:00 GMT

Buddha Venkanna: భూకబ్జాలకు పెటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కేశినేని నాని.. బస్సు టిక్కెట్లు బ్లాకులో అమ్ముకున్నాడు

Buddha Venkanna: మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడిగా పేరుగాంచిన కేశినేని నాని.. నేడు దేవినేని అవినాష్ అనుచరుడిగా మారాడని, కోవర్టుగా మారాడని ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జి బుద్ధా వెంకన్న విమర్శించారు. దొంగ రసీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు కోవర్టు నాని ఎగనామం పెట్టాడని ఆరోపించారు. వంద రూపాయల బస్సు టికెట్టును బ్లాకులో 5 వందల రూపాయలకు అమ్ముకున్నాడని తీవ్ర పదజాలంతో మండిపడ్డారాయన.. ఒకే నంబరు ప్లేటుతో కోవర్టు నాని అనేక బస్సులు తిప్పాడని ఆరోపించారు. భూ కబ్జాలకు విజయవాడ నగరంలో పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని అని ఆరోపించారు.

Tags:    

Similar News