Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ వైఖరి ఏంటి..?
Vishnuvardhan Reddy: ఏపీ ప్రజలు బీఆర్ఎస్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు
Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ వైఖరి ఏంటి..?
Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై ఒక జాతీయ పార్టీగా BRS వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. అంతరాష్ట్ర జల వివాదాలకు సంబంధించి.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం పరిధిలోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారాయన. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆదుకుంటామని ఆర్బాట ప్రకటనలకే పరిమితమైన కేటీఆర్, కేసీఆర్.. కృష్ణా జలాల విషయంలోనైనా సానుకూలంగా స్పందించాలన్నారు విష్ణు వర్దన్ రెడ్డి. ఏపీ ప్రజలు BRS నేతలను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో..కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా నిలబడి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.