Kanipakam: కాణిపాకంలో ఘనంగా చవితి వేడుకలు
* 21రోజుల పాటు బ్రహ్మోత్సవాలు * ప్రతిరోజు రెండు వాహన సేవలు
కాణిపాక వినాయక ఆలయం (ఫోటో: ది హన్స్ ఇండియా)
Kanipakam: దేశంలో ఎక్కడాలేని విధంగా కాణిపాక వినాయక ఆలయంలో 21రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతిరోజు రెండు వాహన సేవలను దేవస్థానం నిర్వహించనుంది. స్వామివారికి ఇష్టమైన వాహనం మూషికంతో వాహనసేవలు ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగనున్నాయి.