చంద్రబాబు కుట్రలో భాగంగానే హైకోర్టులో పిటిషన్‌

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు మంత్రి బొత్స.

Update: 2020-03-02 16:03 GMT
Botsa satyanarayana File Photo

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు మంత్రి బొత్స. బలహీనవర్గాలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ ఉందన్న ఆయన... ఈ విషయంలో టీడీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. చంద్రబాబు... బీసీలకు ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి టీడీపీ శనిలా దాపురించిందని మంత్రి బొత్స మండిపడ్డారు.

ప్రతిపక్షనేత చంద్రబాబు కుట్రతోనే వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయారని విమర్శించారు. చంద్రబాబు బలహీన వర్గాల ఎదుగుదలకు అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని మంత్రి బొత్స వెల్లడించారు. బలహీన వర్గాల ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలవడం చంద్రబాబు చూడలేకపోతున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబుకు వెనుకబడిన వర్గాలు అంటే ఎందుకు అంత కడుపు మంటమని అన్నారు. ఓట్లు వేసేందుకు బీసీలు అంటే ఉపయోగించుకుంటారి మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను బడుగు బలహీన మైనార్టీలకు సీఎం జగన్‌ కల్పించారు. 59 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని అన్నారు. టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు దగ్గరుండి కేసులు వేయిస్తున్నారని మంత్రి బొత్స ఆరోపించారు.

 

Tags:    

Similar News