Botsa Satyanarayana: జగనన్న ఇళ్లపై పవన్ కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్
Botsa Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఫైరయ్యారు.
Botsa Satyanarayana: జగనన్న ఇళ్లపై పవన్ కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్
Botsa Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఫైరయ్యారు. ఇళ్లు లేని వారి కోసం జగన్ పాటుపడుతుంటే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని ప్రతీ పేదవాడికి పక్కా ఇల్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. దీన్ని ప్రశసించకుండా టీడీపీ, జనసేన అధినేతలు రాద్ధాంతం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. పవన్ మాటలకు విలువ లేదని ఎక్కడైనా ఖర్చు పెట్టిన మొత్తంకంటే అవినీతి ఎక్కువ జరుగుతుందా..? అని బొత్స ప్రశ్నించారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. ఓ విధానం లేదు.. అది సెలబ్రిటీ పార్టీ. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అని బొత్స మండిపడ్డారు.