ఆరోగ్యం ఎలా ఉంది?: పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన బొత్స
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఫైల్ ఫోటో
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోటో సెషన్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి వైఎస్ఆర్‌సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారు. ఈ సమయంలో వీరిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది అని పవన్ కళ్యాణ్ ను అడిగారు బొత్స. నడుము నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఈ విషయమై బొత్స డిప్యూటీ సీఎంతో మాట్లాడారు. ఇద్దరు కరచాలనం చేసుకొని తిరిగి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు దిగారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు కూర్చొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు వెనుక వరుసల్లో కూర్చొన్నారు. ఈ ఫోటో సెషన్ గురించి సోమవారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఫోటో సెషన్ లో సభ్యులు పాల్గొనాలని కోరారు.