Botsa Satyanarayana: రాజకీయంలో వారసుల్ని ఎవరైనా దింపొచ్చు.. కానీ ప్రజలు ఆమోదించాలి
Botsa Satyanarayana: 175 స్థానాలు తప్పకుండా గెలిచితీరుతాం
Botsa Satyanarayana: రాజకీయంలో వారసుల్ని ఎవరైనా దింపొచ్చు.. కానీ ప్రజలు ఆమోదించాలి
Botsa Satyanarayana: వారసులు అందరికి ఉంటారని, నాకూ తనకూ అబ్బాయి ఉన్నాడని, కానీ తన కుమారుడు వైద్య విద్య చదువుతున్నాడని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాజకీయాల్లోకి ఎవరైనా వారసుల్ని దింపొచ్చు, కానీ ప్రజలు ఆమోదించాలన్నారాయాన.....175 స్థానాలు గెలవాలనుకోవటం అత్యాశ కాదన్న బొత్స... ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదనుకుంటే ఆ సంఖ్య క్షేత్రస్థాయిలో పది అవుతుందన్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై తనకు సమాచారం లేదన్నారు. తమ పార్టీలో అంతర్గత విషయాలు తాము మాట్లాడుకుంటామని, అవి మీడియాకు అనవసరం అంటూనే... శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే... పార్టీ పరంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సమీక్షించి లోటు పాట్లు చెప్పారన్నారు బొత్స... ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపేనని, అదే సీఎం జగన్ గట్టిగా చెప్పారని బొత్స వెల్లడించారు.