Botsa Satyanarayana: రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే
Botsa Satyanarayana: మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షల సాయం
Vizianagaram: రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే
Botsa Satyanarayana: పలాస రైల్ ప్రమాదం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం ఆదేశం మేరకు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు మరణిస్తే రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 54 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.