ట్రంప్ డిన్నర్‌కు వారికెందుకు పిలుపురాలేదు : బొత్స

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులుపాటు భారత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.

Update: 2020-02-26 14:15 GMT
Jagan And Botsa File Photo

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులుపాటు భారత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో ట్రంప్ గౌరవార్థం న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు పిలుపు రాకపోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దక్షిణ భారత దేశంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఐటీ పరంగా అభివృద్ధి చెందిన నగరాలు కావడంతో.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం జరిగిందని కొందరూ అంటుంటే.. మరికొందరూ.. జగన్‌పై కేసులున్న కారణంగానే పిలుపు రాలేదని అంటున్నారు.

జగన్‌ని ఎందుకు పిలవలేదు..కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. జగన్‌కి ఆహ్వానం అందకపోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.. అమెరికా అధ్యక్షుడితో విందుకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కి కూడా ఆహ్వానం అందలేదని గుర్తుచేశారు. జగన్‌ను మొదటి సారి సీఎం అయ్యారు కాబట్టి పిలవకపోయినా.. మిగిలిన వారు రెండు, మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారేనని, మరి వారికెందుకు ఆహ్వానం అందలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రతిపక్షలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కొందరు సీనియర్ మంత్రులను కూడా ఆహ్వానించలేదని గుర్తు చేశారు. 

బీజేపీతో విభేదిస్తున్న వారిలో కేసీఆర్ ఒకరు. కీలకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు లాంటి అంశాలలోను కేంద్రంపై పోరాట ధోరణిలో కేసీఆర్ కొనసాగుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం బీజేపీతో సయోధ్యతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోదీతోపాటు అమిత్‌షాను కలిసి వచ్చారు. కానీ.. రాష్ట్రపతి భవన్‌లో సయోధ్యతో ఉన్నవారిని కాకుండా.. రాజకీయంగా విభేదిస్తున్న కేసీఆర్‌కు అందడం అందరిని ఆశ్చర్యపరిచింది. బొత్స ఈ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడుకోవడం మానుకోవాలని హితవుపలికారు.  

Tags:    

Similar News