పెన్షన్లు తొలిగించామని చంద్రబాబు నిరూపించగలరా..?

ఏడు లక్షల మందికి పెన్షన్లు తొలిగించామని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. పెన్షన్లు తొలిగించామని చంద్రబాబు చేస్తు్న్న ఆరోపణలు నిరుపించగలరా అని సవాల్ చేశారు.

Update: 2020-02-04 10:34 GMT
బొత్స సత్యనారాయణ ఫైల్ ఫోటో

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి పెన్షన్లు తొలిగించామని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. పెన్షన్లు తొలిగించామని చంద్రబాబు చేస్తు్న్న ఆరోపణలు నిరుపించగలరా అని సవాల్ చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన..గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ఓడించినా ఆయన మారడం లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇచ్చిన వాటికంటే 2 లక్షల పింఛన్లు ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 6 లక్షలకు పైగా పింఛన్లు ఇస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగదని ఇస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం చరిత్రలో లేని విధంగా అర్హులైన పేద వారందరికీ పెన్షన్లు మంజూరు ఇస్తుందని చెప్పారు. ఏడాది నుంచి వైఎస్సార్‌ చేయూత పథకం అమలు చేస్తామని 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వర్తిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసహాయం ఇస్తామని అన్నారు. సాంకేతిక సమస్యతోనో సమాచార లోపంతోనో పెన్షన్‌ ఎవరికైనా రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మంత్రి బొత్స అన్నారు.

  

Tags:    

Similar News