Bopparaju Venkateswarlu: మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఏపీ జేఏసీ ఛైర్మన్

Bopparaju Venkateswarlu: గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాం

Update: 2023-04-30 13:18 GMT

Bopparaju Venkateswarlu Announced the Third Phase of the Movement activity

Bopparaju Venkateswarlu: ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏపిలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ తరఫున ఉద్యమం సాగిస్తామని తెలిపారు. రెండో దశ ఉద్యమం పూర్తవుతున్న నేపథ్యంలో.. మూడో దశ ఉద్యమ పోరాటంపై ఉద్యోగసంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ముందు రోజు మంత్రి ఉపసంఘం చర్చలకు పిలిచిందని... భేటీలో ఏ అంశం తేలకపోవడంతో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయన్నారు. తాము నల్లబ్యాడ్జీలు ధరించే ఉంటామని.. మే 8న ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఉపసంహరించాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News