Srisailam: శ్రీశైలం అన్నపూర్ణ భవన్‌లో పేలిన బాయిలర్‌

Srisailam: శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో ప్రమాదం జరిగింది.

Update: 2022-11-01 07:25 GMT

Srisailam: శ్రీశైలం అన్నపూర్ణ భవన్‌లో పేలిన బాయిలర్‌

Srisailam: శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో ప్రమాదం జరిగింది. భక్తులకు భోజనం, అల్పాహారం తయారీకి ఉపయోగించే వంటగదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకు కారణలేంటని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Tags:    

Similar News