Prakasam district: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలి బీజేపీ మౌన దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని బీజేపీ నాయకులన్నారు.

Update: 2020-03-16 06:22 GMT
BJP Leaders Darna in Prakasam district to abolish local body elections in Andhra Pradesh

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని బీజేపీ నాయకులన్నారు. అధికార పార్టీ వారు తమ ఇస్టానుసారంగా ఇతర పార్టీల వారిని, స్వతంత్రులను ఎవ్వరిని నామినేషన్ వేయనివ్వడం లేదన్నారు. ఒకవేళ నామినేషణ్ వేసిన వారి కుటుంబాలను బెదిరించి, ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఇంకా డబ్బులకు, అధికారులు ప్రలోభ పరిచి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలాగా ఉంది. అదికారాన్ని దుర్వినియోగం పరుస్తూ... అధికారులను, పోలీసు యత్రంగాన్ని ఉపయోగించుకోనిసామాన్యులను, ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఏకగ్రీవంగా విజయం సాధిస్తున్నారని మీడియా ద్వారా వింటున్నాము, చూస్తున్నాము.

శాంతి, అహింసా మార్గం ద్వారా మహాత్మాగాంధీ స్వాతంత్రాన్ని తీసుకువచ్చి, డాక్టర్ బి అర్ అంటేద్కర్ ద్వారా మన దేశాన్ని ప్రజాసౌమ్య దేశంగా మన రాజ్యాంగాన్ని రచించుకున్నామని, అటువంటి రాజ్యాంగంలో మన ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండాలో కూడా రాసుకున్నాము. కానీ నేడు జరుగుతున్న ఎన్నికలు నియంతృత్వ పోకడలతో, హింసాత్మక దోరనులతో జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు రద్దు పరిచి, నూతనంగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించి... శాంతియుత వాతావరణంలో, అందరూ స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గొనేలా చూస్తారని భావిస్తున్నామన్నారు.


Tags:    

Similar News