Daggubati Purandeswari: అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నం
Daggubati Purandeswari: మద్యం కుంభకోణంపై సీబీఐకి, కేంద్రానికి లేఖ రాస్తా
Daggubati Purandeswari: అన్ని రాజకీయ పార్టీలకంటే బీజేపీ భిన్నం
Daggubati Purandeswari: బీజేపీ అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైందని, సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఆమె ఏలూరులో మాట్లాడారు. హస్త కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం ఉపయోగకరంగా ఉంటుందన్నారామె.... ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా సకాలంలో బిల్లులు అందక ఆస్పత్రులు ముందుకు రావడం లేదన్నారు.
పొత్తులపై సమయానుకూలంగా స్పందిస్తామని వెల్లడించారు పురంధేశ్వరి... ఏపీలో మద్యం ద్వారా జేబులు నింపుకొంటున్నారని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. మద్యం కుంభకోణంపై త్వరలో సీబీఐ, కేంద్రానికి కూడా లేఖ రాస్తానని చెప్పారు. కేంద్రం నిధులు ఇచ్చినా... పంచాయతీలకు రాష్ట్రం నిధులను ఇవ్వని పరిస్థితి ఉందన్నారామె.