TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..విఐపీ బ్రేక్ దర్శన వేళలు మార్పు

Update: 2025-05-01 02:00 GMT

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి జులై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు కూడా నేటి నుంచి అమల్లోకి వస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8గంటల నుంచి మొదలవుతుంది. అయితే గతంలో మాదిరిగా మొదటి గంట తర్వాత ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. కాగా నేడు శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక్ సేవ నేపథ్యంలో ఈ రెండు రోజులు మాత్రం పాత వేళలే కొనసాగుతాయని డిప్యూటీ ఈవో లోకనాథం తెలిపారు. 

Tags:    

Similar News