Rains: ఏపీలోని ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్..నేడు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

Update: 2025-05-21 00:56 GMT

Weather Update: నేడు తీరం దాటనున్న వాయుగుండం..తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు..!!

Rains: నైరుతి రుతుపవనాలు ఈనెల 23 లేదా 24 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు నుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 26నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

గతేడాది రుతుపవనాలు సాధారణం కంటే రెండు రోజులు ముందుగా మే 30న కేరళను తాకాయి. అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భమే వచ్చింది. ఈ ఏడాదీ అలాగే జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ సారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావడం ఇదే తొలిసారి అవుతుంది.

అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బుధవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, క్రిష్ణ, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

Tags:    

Similar News