AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్..నేడు,రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP Rains: పశ్చిమబెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పోగోదావరి, ఏలూరు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 10 తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.