Tirumala: తిరుమలలో భోగి సంబరాలు
Tirumala: శ్రీవారి ఆలయం ప్రాంగణంలో భోగి మంటలు
Tirumala: తిరుమలలో భోగి సంబరాలు
Tirumala: తిరుమలలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీవారి ఆలయం ప్రాంగణంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంట వేశారు. కలియుగ దేవుడైన శ్రీనివాసుడి క్షేత్రంలో భోగి పండుగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. మరోవైపు గొబ్బెమ్మ పాటలతో, గోవింద నామస్మరణలతో శ్రీవారి ఆలయం మార్మోగింది.