Bharat Bandh: ఏపీలో సంపూర్ణంగా బంద్

Bharat Bandh: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బంద్ ఏపీలో సంపూర్ణంగా కొనసాగుతోంది.

Update: 2021-03-26 02:57 GMT

Bharat బంద్:(ఫైల్ ఇమేజ్)

Bharat Bandh: కేంద్ర తీసుకొచ్చిన కొత్త సాగు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. రైతుల పిలుపుమేరకు ఏపీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం, వైకాపా, తెదేపా, వామపక్షాలు బంద్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనసంచారం లేక ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్త స్థంభించింది. ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

విశాఖలో...

విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గుంటూరు, కర్నూలు, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ రోజు నుండి రెండు రోజుల ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ‌ సాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు ఈ రోజు ఉదయం బంగ్లాదేశ‌ పర్యటనకు బయలదేరుతున్నారు.

Tags:    

Similar News