Bharat బంద్:( ఫోటో ది హన్స్ ఇండియా)
Bharat Bandh: దేశవ్యాప్తంగా ఈనెల 26న జరిగే భారత్ బంద్ కు ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు తలపెట్టిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇటు రైతులు, అటు కార్మికుల ఆందోళనకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నామని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్‌కు వ్యాపార, కార్మిక సంఘాలు, లారీ, గూడ్స్ వాహనాల యాజమానులు, వివిధ వర్గాలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించాయన్నారు.