Andhra Pradesh: వార్డు వాలంటీర్ల ఫోన్ వాడకంపై హైకోర్టులో పిటిషన్
Andhra Pradesh: సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఏపీ వార్డు వాలంటీర్ల ఫోన్ వాడకంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు అయింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్ వేసింది. ఎలక్షన్ల సమయంలో ఎస్ఈసీ నిర్ణయాలలో కోర్టు జోక్యం తగదని ఎస్ఈసీ తరుపు లాయర్ వాదించారు. దాంతో ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను మార్పు చేసింది. వార్డు వాలంటీర్ల ఫోన్లు వారి పై అధికారులకు సరెండర్ చేయాలని ఆదేశించింది. ఒక వేళ తగు కారనం చూపుతూ ఫోన్ అడిగితే.. సంబంధిత అధికారి వాలంటీర్‌కు ఫోన్ ఇవ్వవచ్చని హైకోర్ట్ పేర్కొంది.