ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన బీద, సానా, ఆర్. కృష్ణయ్య
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ తరపున ఆర్. కృష్ణయ్య మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన బీద, సానా, ఆర్. కృష్ణయ్య
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ తరపున ఆర్. కృష్ణయ్య మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరితేది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు.
ఈ ముగ్గురు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిథ్యం పొందారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో పాటు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. ఈ ముగ్గురి రాజీనామా వెనుక టీడీపీ కుట్ర ఉందని అప్పట్లో వైఎస్ఆర్ సీపీ ఆరోపణలు చేసింది. రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు ఈ ఏడాది అక్టోబర్ 09న టీడీపీలో చేరారు. బీద మస్తాన్ రావుకు టీడీపీ మరోసారి అవకాశం కల్పించింది. మరో స్థానంలో సానా సతీష్ కు అవకాశం కల్పించింది.