Balineni: చిన్న సమస్యను ఉద్యోగులు రాద్ధాంతం చేయడం సరికాదు
Chalo Vijayawada: చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఉద్యోగులకు...
Balineni: చిన్న సమస్యను ఉద్యోగులు రాద్ధాంతం చేయడం సరికాదు
Chalo Vijayawada: చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఉద్యోగులకు మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సూచించారు. చిన్న సమస్యను ఉద్యోగులు ఇంత రాద్దాంతం చేయడం సరైంది కాదని మంత్రి బాలినేని అన్నారు. విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నా నాలుగు డిఏలు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుకూలంగా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు.