Avinash Reddy: ఓ కట్టుకథను అడ్డం పెట్టుకుని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.. రెండో భార్య కొడుక్కి ఆస్తి విషయంలో..
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో తాను ఎటువంటి తప్పు చేయలేదని ఎంపీ అవినాశ్‌రెడ్డి అన్నారు.
Avinash Reddy: ఓ కట్టుకథను అడ్డం పెట్టుకుని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.. రెండో భార్య కొడుక్కి ఆస్తి విషయంలో..
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో తాను ఎటువంటి తప్పు చేయలేదని ఎంపీ అవినాశ్‌రెడ్డి అన్నారు. ఓ కట్టుకథను అడ్డంపెట్టుకొని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారని తెలిపారు. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని..తప్పకుండా తాను న్యాయపోరాటానికి సిద్ధమని ఎంపీ అవినాశ్ తేల్చిచెప్పారు. సీబీఐ అధికారులు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తూ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి 2011లో ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని..ఆ తర్వాత వారికి షేక్ షెహన్ షా అనే అబ్బాయి కూడా పుట్టాడని ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. అయితే రెండో భార్యకు పుట్టిన అబ్బాయికి ఆస్తిని రాసిచ్చే విషయంలో ఏర్పడ్డ తగాదాలే హత్యకు దారితీసి ఉండొచ్చని తాను అనుమానిస్తున్నట్లు అవినాశ్ రెడ్డి తెలిపారు. అప్రూవర్ స్టేట్‌మెంట్‌లోనూ ఆ కీలకమైన డాక్యుమెంట్స్ కోసం వెతికినట్లు సమాచారం ఉందన్నారు.
వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు ఎంపీ అవినాశ్‌రెడ్డి. హత్య సందర్భంలో స్పాట్‌లో ఉన్న ఓ లెటర్..వివేకా హత్య కేసులో అత్యంత కీలకం అని అవినాశ్‌రెడ్డి తెలిపారు. లెటర్ ఉన్న విషయం తనకు సునీత దంపతులు చెప్పలేదని ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలిపారు.