Avinash Reddy: సీబీఐ విచారణకు తప్పించుకునేందుకు మైండ్ గేమ్
Avinash Reddy: తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్న అవినాష్ రెడ్డి
Avinash Reddy: సీబీఐ విచారణకు తప్పించుకునేందుకు మైండ్ గేమ్
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకి లేఖ రాశారు.. తన తల్లి అనారోగ్యంతో హాస్పటల్ ఉన్నందున ..డిశ్చార్జీ చేశాక వస్తాన్నారు...తనకు 10 రోజుల గడువు కావాలని సిబిఐ ని కోరారు..ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరు కాకపోతే సిబిఐ అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు వెనకాడదంటూ ప్రచారం జరుగుతోంది...మరి సిబిఐ అవినాష్ లేఖకు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా సోమవారం నాటి విచారణకు తాను హాజరుకాలేనన్నారు... ప్రస్తుతానికి తన తల్లి ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదని .. ఆమె కోలుకున్న వెంటనే విచారణకు వస్తానని అవినాష్ రెడ్డి ఆ లేఖలో తెలిపారు. తనకు మరో 10 రోజుల పాటు గడువు కావాలని కోరారు... అయితే దీనిపై సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే అవినాష్ రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు.
ఈ నెల 16న అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీచేసిన కమంలో విచారణకు హాజరు కాలేదు...తనకు 4 రోజుల సమయం కోరుతూ సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించి ...మరో మారు అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న శుక్రవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఈ క్రమంలో విచారణకు బయలుదేరిన అవినాష్ రెడ్డి తన తల్లి అస్వస్థతకు గురయ్యారని తెలియగానే పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయాడు .. తన తల్లి ఆస్పత్రిలో ఉన్నారని.. అందువల్ల తాను విచారణకు హాజరుకాలేకపోతున్నానని తన న్యాయవాదుల ద్వారా సీబీఐకి సమాచారమిచ్చారు. 22 న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు...
19 తేదిన అవినాష్ రెడ్డి విచారణకు హైదరాబాద్ నుంచి సిబిఐ ఆఫీస్ కు బయల్దేరుతుండగా.. ఆయన తల్లి లక్ష్మీ అనారోగ్యానికి గురయ్యారని తెలిసి అటు నుంచి అటే పులివెందులకు బయల్దేరారు . ఈ సమాచారాన్ని అవినాష్ తరపు న్యాయవాదులు సీబీఐ అధికారులకు తెలియజేశారు. అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మీని పులివెందుల నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకురావడంతో అవినాష్ తల్లిని పరామర్శించి, ఆమె వెంటే వుండిపోయారు.
ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేయడంతో ...అవినాష్ మరో 10 రోజులు గడువు కోరటంతో సిబిఐ అధికారులు ఏం చేయనున్నారు...ఇక కర్నూల్ కు వెళ్లి అరెస్ట్ చేస్తారా...లేకుంటే ...విచారణకు అవకాశం ఇస్తారా చూడాలి.