వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి.. కౌంటర్‌లో పలు కీలక అంశాలు చేర్చిన సీబీఐ

Avinash Reddy: వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్‌ రెడ్డిని చేర్చింది సీబీఐ.

Update: 2023-06-08 11:41 GMT

వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి.. కౌంటర్‌లో పలు కీలక అంశాలు చేర్చిన సీబీఐ

Avinash Reddy: వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్‌ రెడ్డిని చేర్చింది సీబీఐ. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వేసిన కౌంటర్‌లో అవినాష్‌ను నిందితుడిగా పేర్కొంది. కౌంటర్‌లో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది సీబీఐ. వివేకా హత్య కేసులో కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని.. దర్యాప్తును పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్‌ హత్య స్థలికి చేరుకున్నారని తెలిపింది సీబీఐ. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ముందే శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డితో అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొంది. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేసింది సీబీఐ.

Tags:    

Similar News