Viveka Murder case: వివేకా హత్యకేసు .. ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి
Viveka Murder case: కస్టడీలోని ఉదయ్‌కుమార్, భాస్కర్‌రెడ్డిని విచారించనున్న సీబీఐ
Viveka Murder case: వివేకా హత్యకేసు .. ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి
Viveka Murder case: వివేకా హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. అవినాష్‌తో పాటు సీబీఐ కస్టడీలో ఉన్న ఉదయ్‌కుమార్, భాస్కర్‌రెడ్డిలను కూడా విచారించనున్నారు అధికారులు. నిన్న 8 గంటల పాటు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.. వివేకా హత్యకు దారితీసిన ప్రధాన కారణాలపై ఆరా తీశారు.
రెండోరోజు సీబీఐ విచారణలో.. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి జమ్మలమడుగు దగ్గరలో ఉన్నట్టు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పలు ప్రశ్నలు సంధించారు. హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారు..? 40 కోట్ల డీల్‌కు సంబంధించి అవినాష్‌రెడ్డి పాత్రపై ఆరా తీశారు.
నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అవినాష్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా.. వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సీబీఐ విచారించింది. 6 గంటలపాటు వీరిద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకు దారితీసిన ప్రధాన కారణాలపై ఆరా తీశారు. హత్యకు పన్నిన కుట్ర, సాక్ష్యాధారాలు చెరిపివేయడంలో నిందితుల పాత్రపై ప్రశ్నించారు.