Avinash Reddy: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టుకు ఎంపీ అవినాష్
Avinash Reddy: సీబీఐ విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు అవినాష్‌రెడ్డి
Avinash Reddy: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టుకు ఎంపీ అవినాష్
Avinash Reddy: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టులో అవినాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని పిటిషన్ వేశారు. మరికాసేపట్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అవినాష్ తరుపు లాయర్లు తీసుకురానున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోననేది ఉత్కంఠగా మారింది.