Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు 31కి వాయిదా
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట
Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు 31కి వాయిదా
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 31 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. అవినాష్ తల్లి అనారోగ్యం కారణంగా అరెస్ట్ చేయొద్దని తెలిపింది. ముందుగా తీర్పును ఈనెల 31న వెల్లడిస్తామని ధర్మాసనం తెలపగా.. అప్పటివరకు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులివ్వాలని అవినాష్ లాయర్లు కోరారు. దాంతో మూడు రోజుల సమయం ఇస్తే అభ్యంతరమా అని సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులిచ్చింది.
అంతకుముందు హైకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గంగిరెడ్డి ద్వారా వివేకా హత్యకు అవినాశ్ రెడ్డి కుట్ర చేసాడని.. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాశ్ కుట్ర అమలు చేశాడని సీబీఐ తరపు లాయర్ వాదన వినిపించారు. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించాడని, శత్రువుకి.. శత్రువు మిత్రుడనే విధానం అనుసరించాడన్నారు సీబీఐ తరపు లయర్... అవినాశ్ రెడ్డి నుంచే డబ్బులు వచ్చాయని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చాడని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అవినాశ్ రెడ్డి శివశంకర్ రెడ్డికి ఇస్తే, శివ శంకర్ రెడ్డి గంగిరెడ్డికి ఇచ్చాడని, 4 కోట్లు ఖర్చు పెట్టడానికి శివశంకర్ రెడ్డికి ఏం అవసరమని సీబీఐ తరపు లాయర్ ప్రశ్నించారు. 46 లక్షల రూపాయలను మున్నా లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వివేకా మృతదేహం చూసిన వారెవరైనా మర్డర్ అని చెప్పగలరని, బ్లడ్ వామిట్ చేసుకుంటే 2 లీటర్ల రక్తం బయటికి రాదన్నారు సీబీఐ తరపు న్యాయవాది..
ఇందుకు స్పందించిన ధర్మాసనం వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. రక్తపు మరకలను తుడచడం ఎవిడెన్స్ టెంపర్ ఎలా అవుతుందని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పోస్ట్‌మార్టం కోసం ఇంటి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పుడు డాక్టర్ ఉన్నారా అని ప్రశ్నించింది ధర్మాసనం... అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ వివేక హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు సీబీఐ తరఫు లాయర్... సేఫ్‌సైడ్ కోసమే లెటర్ దాచినట్టు నిర్ధారణ అయిందనన్నారు... లెటర్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, లెటర్‌పై హ్యాండ్ రైటింగ్ వివేకా రాసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు సీబీఐ తరపు లాయర్. సిట్ కేస్ దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్స్‌కు సంబంధించి, అవినాశ్, శివశంకర్ మధ్య వాట్సప్ చాట్ ఉందని హైకోర్టుకు తెలిపారు సీబీఐ న్యాయవాది...
వివేకా హత్య జరిగిన కరెక్ట్ సమయం చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఒంటి గంటా 10 నిమిషాల నుంచి ఒంటి గంగా 30 నిమిషాల మధ్య వివేకా హత్య జరిగిందని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. వివేకా హత్య జరిగిన రోజు జమ్మలమడుగు దారిలో ఉన్నట్టు అవినాశ్ తప్పుడు సమాచారం చెప్పాడన్నారు సీబీఐ తరపు న్యాయవాది.. మిగతా సాక్షులు వెనుక వాహనాల్లో ఉన్నట్టు చెప్పారని తెలిపారాయన... కానీ ఆరోజు జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ లేదని తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వివేకా మరణ విషయం ముందే తెలిసినప్పటికీ... థర్డ్ పర్సన్ నుంచి న్యూస్ వచ్చే వరకు అవినాశ్ ఇంట్లోనే వెయిట్ చేశాడని తెలిపారు సీబీఐ తరపు న్యాయవాది...
అయితే అవినాశ్ ఆ సమయానికి ఇంట్లోనే ఉన్నాడని ఎలా చెబుతారని సీబీఐ తరపు లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అవినాశ్‌కు వివేకా మరణం గురించి ముందే తెలుసనడానికి ఆధారాలు ఏమున్నాయని ధర్మాసనం ప్రశ్నంచింది. మార్చి 15న తెల్లవారుజామున ఒంటి గంటా 50 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు అవినాశ్ కాల్స్ మాట్లాడినట్టు డేటా ఉందని సమాధానమిచ్చారు సీబీఐ తరపు న్యాయవాది.. మే 12న అవినాశ్ ఫోన్ ఐడీపీఅర్ డేటా తీశామని చెప్పారాయన. గంగిరెడ్డిని వాట్సాప్ చాట్ గురించి అడిగారా అని హైకోర్టు ధర్మాసనం సీబీఐ లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరపు లాయర్ సమాధానమిస్తూ.. విచారణలో గంగిరెడ్డి అవినాశ్‌తో చాట్ చేసినట్టు ఒప్పుకోలేదని చెప్పారు.