Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి భార్యపై దాడి
UmaShankar Reddy Wife: కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, అతని కుమారుడు దాడి చేశారు
Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి భార్యపై దాడి
Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3 నిందితుడు ఉమా శంకర్‌రెడ్డి భార్య స్వాతి పోలీసులను ఆశ్రయించింది. కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి అతని కుమారుడు తనపై దాడి చేశారని స్వామి పేర్కొంది. వివేకానందరెడ్డిని చంపినట్లుగానే తన భర్తను, తనను చంపుతామని బెదిరించారని పేర్కొంది. బలంగా తోసివేయడంతో కింద పడిపోయానని... గాయాలు కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలిపింది. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్వాతి వెల్లడించింది.