Guntur: గుంటూరులో మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి
Guntur: కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు
Guntur: గుంటూరులో మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి
Guntur: గుంటూరులో ఒక్కాసారిగా రాజకీయాలు వేడెక్కాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. గుంటూరు వెస్ట్‌లో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై దాడి చేసి... అద్దాలు ధ్వంసం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలుచేసుకుంటూ.. మంత్రి కార్యాలయం సమీపంలో హంగామా చేశారు. ఇక్కడ వద్దంటూ పోలీసులు వారిని వారించారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంపై దాడి దిగడంతో..నూతన కార్యాలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాగా..నేడు ఆ కార్యాలయాన్ని మంత్రి విడదల రజిని ప్రారంభించనున్నారు.