నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

*ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,13,330 మంది

Update: 2022-06-23 02:23 GMT

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల నిర్వహణకు నియోజకవర్గంలో 279 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 123 సమస్మాత్మక కేంద్రాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. మొత్తం 2లక్షల 13వేల 330 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్‌ లైవ్‌ ద్వారా పోలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.

2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్లు మెజార్టీ లభించింది. రెండో దఫా 2019 ఎన్నికల్లోనూ 22,276 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలు ఇవే కావడంతో ఆ రికార్డులు గౌతమ్‌రెడ్డికి దక్కాయి. స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్న వారిలో మరో ఇరువురు ఉన్నారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి బి.సుందరరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి కె.ఆంజనేయరెడ్డిపై 334 ఓట్లతో విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్షుమయ్య నాయుడిపై 2,069 ఓట్లతో విజయం సాధించారు. ఇవే తక్కువ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందిన ఎన్నికలు కావడం విశేషం.

Tags:    

Similar News