ఆత్మకూరు ఉపఎన్నికల్లో అనివార్యమైన పోటీ.. మే మొదటి వారంలో వెలువడనున్న నోటిఫికేషన్...

Atmakur By-Elections: ఎన్నిక ఏకగ్రీవంకావాలనే అధికార పార్టీ ప్రయత్నం...

Update: 2022-04-23 08:39 GMT

ఆత్మకూరు ఉపఎన్నికల్లో అనివార్యమైన పోటీ.. మే మొదటి వారంలో వెలువడనున్న నోటిఫికేషన్...

Atmakur By-Elections: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక కు సన్నాహాలు మొదలయ్యాయి. భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలచేసేందుకు సిద్ధమైంది . జూలైలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉపఎన్నిక జరగబోతోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు తమ బలాన్ని చాటుకునేందుకు ఏర్పాటు చేస్తున్నాయి.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో ఉప ఎన్నిక సత్వర అవసరంగా ఎన్నికల కమిషన్ భావిస్తోంది. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్ట్రోరల్ కాలేజీలో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఓట్లు వేయాల్సి ఉంది. ఈ నేథ్యంలో దేశం లో ఖాళీగా ఉన్న లోక్ సభ, శాసన సభ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీంతో ఆత్మకూరు ఉప ఎన్నిక జూన్ నెల లో నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మే నెలలో ఈ మేరకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఏదేని కారణం చేత ప్రజాప్రతినిధి కన్నుమూసినట్లు అయితే వారి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యమివ్వాలనే సాంప్రదాయాన్ని అధికార ప్రతిపక్షలు కొనసాగిస్తున్నాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబీకులకే అవకాశం ఇవ్వాలని, ఎన్నిక ఏకగ్రీవంచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడతామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. దీంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఉప ఎన్నిక కు పోటీజరగబోతోంది.

అధికార పార్టీ నుంచి మేకపాటి కుటుంబానికి చెందిన దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ లేనప్పటికీ భారతీయ జనతా పార్టీ తాము పోటీకి సిద్ధంకావడంతో ఏకగ్రీవానికి అవకాశంలేకుండా పోయింది. మరోవైపు ఇటీవల మేకపాటి కుటుంబానికే చెందిన రాజమోహన్ రెడ్డి సోదరి కుమారుడు బిజివేముల రవీంద్రారెడ్డి తాను పోటీ చేస్తున్నట్లు గా ప్రకటించారు. టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ... లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా తాను ఉప ఎన్నికల రంగంలో ఉంటానని వెల్లడించారు. మైనార్టీ విభాగానికి చెందిన కొందరు నాయకులు ఆత్మకూరులో పోటీ చేస్తున్నట్లు ఆసక్తిచూపుతున్నారు.

Tags:    

Similar News