Atchannaidu: రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశాడు
Atchannaidu: ఏపీలో సైకోపాలన కొనసాగుతోంది
Atchannaidu: రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశాడు
Atchannaidu: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అందరికీ చుక్కలు చూపిస్తున్నాడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చంనాయుడు అన్నారు. సైకోపాలనతో జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అచ్చంనాయుడు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటించారు. డబ్బులు పంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోందని దీనిని అన్నివర్గాల వారు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.