మత్య్సకారులకు వరాల జల్లు కురిపించిన సీఎం జగన్‌

Update: 2019-11-21 17:09 GMT
ys jagan

ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం లెక్క చేయక చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. ఏ పొద్దుకాపొద్దు వేట చేసి తీసుకువచ్చే మత్స్య సంపదను అమ్మితే గానీ బతుకు నడవని మత్స్యకారుల తలరాతమారిపోయింది. ఆకలి కేకలతో బతుకు నావను దుర్భరంగా నెట్టుకొస్తున్న మత్స్యకుటుంబాల్లో వెలుగువచ్చాయి..

గంగపుత్రుల జీవితాలు మారాయి. నిన్నమొన్నటి వరకు బతుకుపోరాటం చేస్తున్న వేటగాళ్ల జీవితాల్లోకి వెలుగులు వచ్చాయి. సంచలనాల నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మరో బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించారు.

నేను విన్నాను నేను ఉన్నాను అన్నట్లుగానే జగన్‌ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నవరత్నాలతో పాటూ కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల మనసు దోచుకుంటున్నారు. .ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.మత్స్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్‌ వర్షాల జల్లు కురిపించడంపై గంగపుత్రులు హర్షం వ్యక్తం చేశారు.

మత్స్యకారుల ఘోషను అర్థం చేసుకున్న సీఎం జగన్‌ మత్స్యకార భరోసా స్కీంను తీసుకువచ్చారు. వేట నిషేధ సమయంలో సరైన ఉపాది లేక అప్పులతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఇకపై 10 వేల రూపాయలు నేరుగా మత్స్యకారుల అకౌంట్‌లో పడనున్నాయి. సబ్సిడీ కింద డీజిల్ కూడా అందజేయడంతో పాటు మత్స్యకార కుటుంబాల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 10లక్షలు అందించనున్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాలను పారదర్శకంగా అమలు అయితే వేటగాళ్ల జీవితాల్లే మారిపోతాయన్నారు మత్స్యకార సంఘాలనాయకులు.

మత్స్యకార భరోసా పథకంతో లక్షా 35వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్‌. ప్రతి మత్స్యకార కుటుంబానికి తోడుగా ఉంటానని చెప్పిన ఆయన మీకిచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మోడువారిన తమ జీవితాల్లోకి నవవసంతం తీసుకువచ్చిన ...సీఎం .జగన్ కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని మత్స్యకారులు చెబుతున్నారు.. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడిగా మత్స్యకారుల మదిలో నిలిచిపోయారు. 

Tags:    

Similar News