టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్‌?

Update: 2019-09-17 11:44 GMT

ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్‌ జారీ అయినట్లు తెలుస్తోంది. దాంతో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో అచ్చెన్నాయుడును పోలీసులు అడ్డుకోవడంతో అచ్చెన్నాయుడు ఆవేశానికి గురయ్యారు. ఎస్పీపై ఫైరవుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తాడేపల్లి పీఎస్‌‌లో కేసు నమోదైంది. ఈ కేసులో అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్‌ జారీ అయినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News