అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరు
*సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన కొత్తపల్లి గీత దంపతులు
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరు
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులోు కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కొత్తపల్లి గీతను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.