Andhra Pradesh: గ్రూప్1 పరీక్షలపై విమర్శలు అర్ధరహితం: సలాంబాబు
Andhra Pradesh: ఏపీపీఎస్సీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు సలాంబాబు.
APPSC Member Salam Babu (File Image)
Andhra Pradesh: ఏపీపీఎస్సీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు సలాంబాబు. గ్రూప్1 పరీక్షలపై విమర్శలు అర్ధరహితమన్నారు. ఏదో జరిగినట్లు ఊహాగానాలు సృష్టిస్తున్నారని.. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను నిబంధనల ప్రకారమే క్వాలిఫై చేశామన్నారు. ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చామని.. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు.
గ్రూప్1 ఇంటర్వ్యూలు, పరీక్షల నిర్వహణ అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలు, గ్రూప్1 ఇంటర్వ్యూలపై అభ్యర్థులను హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల ఆరోపణల నేపథ్యంలో గ్రూప్1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే విధించింది.