జగన్ దూకుడుకు హైకోర్టు బ్రేక్

Update: 2019-07-25 15:39 GMT

Appeal High Court on GO No. 63 issued by the government for review.

 విద్యుత్ ఛార్జీలపై సంప్రదింపులకు రావాలని...ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖను కూడా సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. పీపీఏలపై సమీక్షపై ఏపీ ప్రభుత్వ జీవోపై 40 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏల తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముకుల్ రోహత్గి వాదించారు.

ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో విద్యుత్ ఒప్పందాలు ఒకటి. దీనిపై సమీక్షకు ఏపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించింది. దీనిపై పలు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమిటీకి సమీక్షించే అధికారం లేదని వాదించాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

తగ్గించిన ధరల ప్రకారం విద్యుత్ సరఫరా చేయాలని..లేనిపక్షంలో తమ వైఖరి కమిటీ ముందు వెల్లడించాలని పేర్కొంటూ APSPDCL జులై 12వ తేదీన రాసిన లేఖను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరాయి. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 ప్రకారం ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ను ఆమోదించినా అధికారంలేని ఇంధన శాఖ, ఎస్పీడీసీఎల్‌లు తగ్గించాలని కోరుతున్నాయని సంస్థలు పేర్కొన్నాయి.

 ఒకసారి ఒప్పందం చేసుకున్న అనంతరం ధరలను సమీక్షించే అధికారం కేవలం ఏపీఈఆర్‌సీకి మాత్రమే ఉందని..సంప్రదింపుల కమిటీకి లేదని తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 40కి పైగా సంస్థలు హైకోర్టు తలుపు తట్టాయి. దీనిపై 2019, జులై 25వ తేదీ గురువారం వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు

Tags:    

Similar News