Apex Council Meeting Adjourned Again: మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా..

Apex Council Meeting Adjourned Again: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల జ‌ల వివాదం ఇప్ప‌ట్లో ప‌రిష్క‌రం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. తాజా మ‌రో సారి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం మ‌రో సారి వాయిదా ప‌డింది.

Update: 2020-08-23 09:21 GMT

Apex Council Meeting Adjourned Again

Apex Council Meeting Adjourned Again: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల జ‌ల వివాదం ఇప్ప‌ట్లో ప‌రిష్క‌రం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. తాజా మ‌రో సారి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం మ‌రో సారి వాయిదా ప‌డింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ మ‌ధ్య జ‌ల వివాదాల‌ను ప‌రిష్కరించడానికి కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఏర్పాటు చేసిన అత్యున్న‌త స్థాయి అపెక్స్ కౌన్సిల్

స‌మావేశం వాయిదా ప‌డింది. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందువల్లే అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారని భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే స‌మావేశ తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది,

తొలుత అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం ఈ నెల 5న‌ నిర్వహించాల్సి ఉండ‌గా.. తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో వాయిదా ప‌డింది. అయినప్పటికీ కేంద్రం పట్టు వదలకుండా 25వ‌ తేదీన సమావేశాన్ని ఖరారు చేసింది .. ఈ మేర‌కు ఇద్దరు సీఎంల‌కు స‌మాచారం ఇచ్చింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యంత వాడివేడిగా జరుగుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే... రెండు రాష్ట్రాలూ జన వనరులపై చుక్క నీరు కూడా వదులుకునేది లేదనే పట్టుదలతో ఉన్నాయి. ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి... నెక్ట్స్ సమావేశానికి మరింత ఎక్కువగా ప్రిపేర్ అయ్యేందుకు ఛాన్స్ దొరుకుతోంది. 

Tags:    

Similar News