పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్
AP Women Commission: 10 రోజుల్లో నేరుగా పవన్ కానీ వారి ప్రతినిధి ద్వారా కానీ తెలియజేయాలని సమన్లు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్
AP Women Commission: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్‌లకు.. వాలంటీర్స్ కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై సమన్లు జారీ అయ్యాయి. పవన్ చెప్పిన మహిళల అదృశ్య లెక్కలపై ఆధారాలను.. 10 రోజుల్లో నేరుగా పవన్ కానీ వారి ప్రతినిధి ద్వారా కానీ తెలియజేయాలని ఆదేశించింది మహిళా కమిషన్. అయితే ఏ కేంద్రం సమాచారం ఇచ్చిందో చెప్పాలంటూ సమన్లు జారీ చేశారు. మహిళల భద్రతపై భీతిగొలిపేల, ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగేలా పవన్ కామెంట్స్ ఉన్నాయని మహిళా కమిషన్ తెలిపింది.