AP SSC Exams 2025: మార్చి 17 నుంచి టెన్త్..మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్..షెడ్యూల్ ఇదే
AP SSC Exams 2025: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. 2025 మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించేందుకు ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఎస్సెస్సీ బోర్డు షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ ఆమోదించిన తర్వాత షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు షురూ కానున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ప్రతిపాదిత షెడ్యూల్ ను ప్రభుత్వం ఆమోదం కోసం ఇంటర్ బోర్డు పంపించింది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంట్ సైన్స్ , మోరల్ వాల్యూస్ పరీక్షలను ఫిబ్రవరి 1,3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు పరీక్షలు ముగియడానికి ఒకరోజు ముందు నుంచే టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి.
ఏపీ ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజులు చెల్లింపు గడువు ముగిసింది. ఫీజుల చెల్లింపు షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు గత నెలలో రిలీజ్ చేసింది. నవంబర్ 21తో ఫీజులు చెల్లింపు గడువు కూడా ముగిసింది. ఇంటర్, ఫస్ట్, సెంకడ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులతోపాటు సప్లమెంటరీ విద్యార్థులు ఫీజులు చెల్లింపు తేదీలను ఖరారు చేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్ష ఫీజులను చెల్లించాలి. వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది.
ఇంటర్ ఫస్ట్, సెంకండ్ ఇయర్ వార్షిక ఫీజులతో పాటు గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు, ప్రైవేటుగా పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాలని సూచించింది ఇంటర్ బోర్డు.