Constitution Day: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యార్థుల మాక్ అసెంబ్లీ

ఏపీ శాసనసభ ప్రాంగణంలో విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

Update: 2025-11-26 05:51 GMT

Constitution Day: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యార్థుల మాక్ అసెంబ్లీ

అమరావతిలో విద్యార్థులు మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. మాక్‌ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలా గౌతమ్‌...ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య...డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి...విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి....స్పీకర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్‌ అసెంబ్లీలో సోషల్‌ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

Tags:    

Similar News